Unicef: కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోండి.. పాకిస్థాన్‌కు యూనిసెఫ్ విజ్ఞప్తి

by vinod kumar |
Unicef: కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోండి.. పాకిస్థాన్‌కు యూనిసెఫ్ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత రోజురోజుకూ తీవ్రంగా పడిపోతోంది. పంజాబ్ ప్రావీన్సులో(Panjaab Praveence) ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(Unicef) కీలక విజ్ఞప్తి చేసింది. పంజాబ్ ప్రావీన్సులో విషపూరిత గాలిని పీల్చడం వల్ల 11 మిలియన్ల మంది పిల్లలు అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని, కాబట్టి వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు యూనిసెఫ్ ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్(Abdhullah fadhuil) తెలిపారు. అత్యంత ప్రభావితమైన జిల్లాల్లోని ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న11 మిలియన్ల మంది పిల్లలు కాలుష్యంతో ప్రభావితం చెందుతున్నట్టు తెలిపారు. గర్భిణీ స్త్రీలపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. వారు నెలలు నిండకుండానే ప్రసవించే చాన్స్ ఉందని తెలిపారు. స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రతి బిడ్డ హక్కు కాబట్టి కాలుష్య నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వానికి సూచించారు. కాగా, పంజాబ్‌ ప్రావీన్సులోని ఏడు జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 దాటింది.

Advertisement

Next Story

Most Viewed