Tax Department : 15 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by S Gopi |
Tax Department : 15 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.4 శాతం పెరిగాయని ఆదాయపు పన్ను విభాగం సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10వ తేదీ మధ్య కాలంలో మొత్తం రూ. 12.1 లక్షల కోట్ల విలువైన పన్ను వసూళ్లు జరిగాయి. స్థూల ప్రాతిపదికన కార్పొరేట్, వ్యక్తిగత పన్నుల సహా ప్రత్యక్ష పన్నులు సమీక్షించిన కాలంలో 21 శాతం వృద్ధితో రూ. 15 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆదాయపు పన్ను శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో రూ. 2.9 లక్షల కోట్ల విలువైన రీఫండ్లను జారీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed