PMJDY: జన్‌ధన్ ఖాతాల కేవైసీ అప్‌డేట్ చేయాలని బ్యాంకులను కోరిన కేంద్రం

by S Gopi |
PMJDY: జన్‌ధన్ ఖాతాల కేవైసీ అప్‌డేట్ చేయాలని బ్యాంకులను కోరిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: జన్‌ధన్ ఖాతాలను అప్‌డేట్ చేయాలని, అందుకోసం ఆయా ఖాతాలకు తాగా కేవైసీ ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం బ్యాంకులను కోరింది. ఈ మేరకు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు సోమవారం తెలిపారు. 2014లో తొలిసారిగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ఖాతాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఏడాది ఆగష్టు నుంచి డిసెంబర్ నాటికి సుమారు 10.5 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు పదేళ్ల సమయం గడిచిన నేపథ్యంలో తిరిగి కేవైసీ ప్రక్రియ అవసరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. తాజాగా ఎం నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏటీఎం, మొబైల్ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంక్ సహా అనేక డిజిటల్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, ఈ క్రమంలో వేలిముద్రలు, ముఖాల గుర్తింపు, కేవైసీ పత్రాల రీ-డిక్లరేషన్ అవసరమని చెప్పారు. పీఎంజేడీవై స్కీమ్‌ను ప్రారంభించిన సమయంలో ఉన్న తరహాలోనే బ్యాంకులు ఉత్సాహంతో ఈ పనిని పూర్తి చేయాలని, కస్టమర్లు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మిషన్ మోడ్‌లో రీ-కేవైసీని పూర్తి చేయాలని నాగరాజు బ్యాంకులకు సూచించారు.

Advertisement

Next Story