Navjot Sidhu : ట్రావిస్ హెడ్‌ భారతీయులందరినీ కించపరిచాడు.. : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

by Sathputhe Rajesh |
Navjot Sidhu : ట్రావిస్ హెడ్‌ భారతీయులందరినీ కించపరిచాడు.. : నవజ్యోత్ సింగ్  సిద్ధూ
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ 150 కోట్ల మంది భారతీయులను కించపర్చాడని భారత మాజీ క్రికెటర్ సిద్ధూ అన్నాడు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ‘మెల్‌బోర్న్ టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ అసభ్యకరమైన ప్రవర్తన జెంటిల్ మెన్ గేమ్‌కు ఏ మాత్రం మంచిది కాదు. పిల్లలు, మహిళలు, యువకులు, పెద్దవారు మ్యాచ్ చూస్తున్నప్పుడు అలా చేయడం సరికాదు. ఇది కేవలం ఒక వ్యక్తిని కించపర్చినట్లుగా లేదు. దేశంలోని 150 కోట్ల మంది భారతీయులను కించపర్చినట్లుగా ఉంది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా హెడ్‌ను కఠినంగా శిక్షించాలి.’ అని సిద్ధూ డిమాండ్ చేశాడు. మెల్ బోర్న్ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్-పంత్‌ క్రీజులో పాతుకుపోయారు. ఆ సమయంలో హెడ్ బౌలింగ్‌లో పంత్ ఔట్ అయ్యాడు. అనంతరం హెడ్ తన చేతి వేళ్లను దగ్గరకు చేసి అందులో మరో చేతి వేలు పెట్టి తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు. అదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇదే ఘటనపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందిస్తూ..‘హెడ్ చేతి వేలికి గాయమైంది. ఐస్‌లో తన చేతి వేలిని ఉంచి ఉపశమనం పొందాడు. గబ్బా లేదా మరో మైదానమైనా వికెట్ తీయగానే హెడ్ ఇలానే సంబరాలు చేసుకుంటాడు. అంతే తప్పా ఇందులో మరో ఉద్దేశం లేదు’ అని కమ్మిన్స్ అన్నాడు.

Advertisement

Next Story