'నేను మలాలా కాదు, భారత్‌లో స్వేచ్ఛగా ఉన్నాను: కశ్మీరీ జర్నలిస్ట్

by S Gopi |
నేను మలాలా కాదు, భారత్‌లో స్వేచ్ఛగా ఉన్నాను: కశ్మీరీ జర్నలిస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ వేదికల మీద భారత్ గౌరవాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని కశ్మీరి సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో భాగమైన కశ్మీర్‌లో తాను సురక్షితంగా, స్వేచ్ఛగానే ఉన్నానని స్పష్టం చేశారు. బ్రిటన్ పార్లమెంట్‌లో జరిగిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో యానా మీర్.. జమ్మూకశ్మీర్ ప్రజలను విభజించే ప్రక్రియను ఆపేయాలని అంతర్జాతీయ మీడియాను కోరారు. 'నేను మలాలా యూసుఫ్‌జాయ్‌ను కాదు. ఎందుకంటే నేను భారత్‌లో భాగమైన నా మాతృభూమి కశ్మీర్‌లో సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నాను. నేను ఎన్నటికీ భారత్ నుంచి పారిపోయి శరణార్థిలా ఆశ్రయం పొందాల్సిన అవసరంలేదు. నేను మలాలా యూసుఫ్‌జాయ్‌ను అస్సలు కాద'ని ఆమె పేర్కొన్నారు. నా దేశాన్ని, నా మాతృభూమి కశ్మీర్‌ను అణచివేయబడిన ప్రాంతమని చెప్పే మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కశ్మీర్‌ను సందర్శించేందుకు ఎన్నడూ ఇష్టపడని అంతర్జాతీయ మీడియాలో అక్కడ అణచివేత జరిగిందని వచ్చే కథనాలను వ్యతిరేకిస్తున్నాను అని యానా మీర్ అన్నారు. ఇప్పటికైనా కశ్మీర్ ప్రజలను ప్రశాంతంగా జీవించనివ్వండి అని ఆమె అభ్యర్థించారు. యూకే పార్లమెంట్​లో జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఆ దేశ పార్లమెంట్ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు, కమ్యూనిటీ నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed