Illegally entering : భారత్‌లోకి అక్రమ ప్రవేశం.. ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

by vinod kumar |
Illegally entering : భారత్‌లోకి అక్రమ ప్రవేశం.. ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు బంగ్లాదేశీయులు, ఇద్దరు రోహింగ్యాలను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసినట్టు త్రిపుర పోలీసులు ఆదివారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు రైల్వే పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు అగర్తల స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. మొదట అనుమానం వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా మరో ఇద్దరు ఇప్పటికే సరిహద్దు కంచె దాటి బాగిచెర్ర గ్రామం వైపు వెళ్లినట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్ర పోలీసుల సహకారంతో వారిద్దరిని సైతం అరెస్టు చేశారు. పట్టుబడిన బంగ్లాదేశ్ పౌరులందరూ సిల్హెట్ జిల్లాలోని మౌల్విబజార్ నివాసితులు కాగా..వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. అలాగే మరొక ఘటనలో జీఆర్పీ సిబ్బంది అగర్తల రైల్వే స్టేషన్ నుంచి ఒక మహిళతో సహా ఇద్దరు రోహింగ్యాలను పట్టుకున్నారు. కాగా, గత మూడు నెలలుగా 310 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులు, 34 మంది రోహింగ్యాలు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించగా.. వీరందరినీ త్రిపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story