IIT Delhi: ఐఐటీ ఢిల్లీకి రూ. 120 కోట్ల జీఎస్టీ షోకాజ్ నోటీసు

by S Gopi |
IIT Delhi: ఐఐటీ ఢిల్లీకి రూ. 120 కోట్ల జీఎస్టీ షోకాజ్ నోటీసు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) ఇంటెలిజెన్స్ షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. 2017-2022 మధ్య పొందిన పరిశోధన గ్రాంట్‌లపై వడ్డీ, జరిమానాలతో కలిపి రూ. 120 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి, జీఎస్టీ అధికారులు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే పరిశోధనలకు జీఎస్టీ వర్తించదని, నోటీసులను తాను వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ మీడియాకు చెప్పారు. ఐఐటీ ఢిల్లీ దీనిపై స్పందించలేదు. ఇది పొరపాటు జరిగి ఉండొచ్చని, నోటీసులపై స్పందిస్తామని అధికారి తెలిపారు. పరిశోధనలను పన్ను పరిధిలోకి తీసుకోకూడదని, తగిన మద్దతివ్వాలని అన్నారు. అయితే, దేశంలోని ప్రముఖ ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ-ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సహా వివిధ విద్యాసంస్థలకు జీఎస్టీ నోటీసులు జారీ చేసినట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed