భారత్‌పై Ukraine విదేశాంగ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..

by Vinod kumar |   ( Updated:2022-12-06 11:00:51.0  )
భారత్‌పై Ukraine విదేశాంగ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
X

కీవ్: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము బాధపడుతుంటే మీరూ ప్రయోజనం పొందుతున్నారా అని భారత్‌ను ప్రశ్నించారు. రష్యన్ ఆయిల్ అతి తక్కువ ధరలకు దిగుమతి చేసుకోవడం, నైతికంగా సరైంది కాదని అన్నారు. రష్యా ఆక్రమణలకు గురై ఉక్రేనియన్లు ప్రతిరోజూ చనిపోతున్న కారణంగా రష్యా చమురును చౌక ధరకు కొనుగోలు చేసే అవకాశం భారత్‌కు వచ్చిందని అన్నారు. తాజాగా ఎన్డీటీవీతో ఆయన మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ వైపు చూపిస్తూ.. వాళ్లు చేస్తున్నారని భారత్ చేయడం సరైంది కాదని అన్నారు. అయితే యుద్ధాన్ని ముగించడంలో భారత ప్రధాని ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పారు. ఇది యుద్ధాల యుగం కాదని ప్రధాని చెప్పడం ప్రొత్సహకంగా ఉన్నప్పటికీ, తెర వెనుక దౌత్యం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యన్‌లతో పోరాటంలో ఏ ఒక్క రోజు కూడా ఆగిపోలేదని పేర్కొన్నారు. రష్యా సైన్యం శక్తి వనరుల పై దాడి చేయడం తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే వారు ఏం చేసిన పోరాడి గెలుస్తామని కులేబా అన్నారు.

Advertisement

Next Story