అదే జరిగితే కాశ్మీర్‌లో వారి రిజర్వేషన్లు రద్దవుతాయి: హోంమంత్రి అమిత్ షా

by Mahesh |
అదే జరిగితే కాశ్మీర్‌లో వారి రిజర్వేషన్లు రద్దవుతాయి: హోంమంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ(BJP) దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ(Prime Minister Modi) శనివారం దోడాలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Home Minister Amit Shah) జమ్మూ ప్రాంతంలో మూడు సమావేశాలకు హాజరు అవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో తాము అధికారంలో వస్తే.. ఆర్టికల్ 370 ని పునరుద్ధరిస్తామని ఎన్‌సీ, కాంగ్రెస్ పార్టీలు అంటున్నాయని.. ఒక వేళ అదే కనుక జరిగితే.. రాష్ట్రంలోని పహాడీ, గుజ్జర్ల రిజర్వేషన్లు రద్దవుతాయి అని అమిత్ షా చెప్పుకొచ్చారు. అలాగే కాశ్మీర్ ప్రజలు ప్రస్తుతం ఆనందంగా ఉన్నారని.. ఈ పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్, ఫరూక్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదన్నారు. ఆర్టికల్ 370 అనేది చరిత్ర గానే మిగిలిపోతుందని.. దానికి భారత రాజ్యాంగంలో చోటే లేదన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో రెండు రాజ్యాంగాలకు, రెండు జెండాలకు, ఇద్దరు ప్రధానులకు చోటు లేదని.. కాశ్మీర్‌లో ఎగిరేది కేవలం మూడు రంగుల జెండా మాత్రమే అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed