ఇందిరాగాంధీని 'భారతమాత' గా భావిస్తా.. కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
ఇందిరాగాంధీని భారతమాత గా భావిస్తా.. కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని భారతమాత గా భావిస్తానని సినీ నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపి అన్నారు. కేరళ మాజీ సీఎం కరుణాకరన్ స్మారకం అయిన మురళీ మందిరం ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరుణాకరన్, ఈకె నాయనార్ లు తనకు రాజకీయ గురువులని, తన గురువుకు నివాళులు అర్పించేందుకే ఇక్కడికి వచ్చానని, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని ఆయన కోరారు. ఇప్పటికీ కరుణాకరన్, ఈకె నాయనార్ కుటుంబసభ్యులతో సన్నిహిత సంబందాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి అని, అలాగే ఇందిరా గాంధీని భారతమాత గా భావిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే కరుణాకరన్ ను కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రిగా భావించడం అనేది దక్షిణాది రాష్ట్రాంలోని పార్టీ వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులను అగౌరవపరచడం కాదని వివరించారు. కరుణాకరన్ ఆయన తరానికి చెందిన ధైర్యవంతమైన నిర్వాహకుడు అని, ఆయన పరిపాలనా సామర్ధ్యాలు గొప్పగా ఉండేవని ప్రశంసించారు. కాగా బీజేపీ అభ్యర్ధిగా కేరళలో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేష్ గోపి ఇందిరాగాంధీని భారత మాత అనడం, కాంగ్రెస్ నాయకులను ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed