మీరు గ్రేట్ సర్.. ఐఏఎస్ ఆఫీసర్ విజిటింగ్ కార్డుకు నెటిజన్ల ఫిదా

by Prasad Jukanti |
మీరు గ్రేట్ సర్.. ఐఏఎస్ ఆఫీసర్ విజిటింగ్ కార్డుకు నెటిజన్ల ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో:సమాజంలో ఏదైనా మార్పు కోసం మొదలు పెట్టే ఓ చిరు ప్రయత్నం అనేక మందిని ఆలోచింప చేస్తుంది. తాజాగా ప్రకృతిపై ప్రేమతో ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన అలాంటి చిన్న ప్రయత్నమే వైరమీరు గ్రేట్ సర్.. ఐఏఎస్ ఆఫీసర్ విజిటింగ్ కార్డుకు నెటిజన్ల ఫిదా

ల్ గా మారింది. ప్రకృతి ప్రేమికుడైన ఆ ఆఫీసర్ చేసిన వినత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. అంతే కాదు పర్యావరణంలో చెట్ల ప్రాముఖ్యత తెలిపే విధంగా నూతన ఒరవడికి నాంది పలికింది. మహారాష్ట్రలోని సాంగ్లీ మిరాజ్ కుప్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న శుభం గుప్తా అనే ఐఏఎస్ ఆఫీసర్.. తన విజిటింగ్ కార్డును విన్నూత్నంగా తయారు చేయించారు. ఈ విజిటింగ్ కార్డును భూమిలో పాతిపెడితే అందమైన బంతిమొక్క పెరిగుతుంది. అందుకోసం ఆ విజిటింగ్ కార్డులో బంతిపువ్వు విత్తనాలను అమర్చారు. ఈ విజిటింగ్ కార్డుకు సంబంధించిన ఫోటోలను శుభం గుప్తా.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇక నుంచి నా ఆఫీస్ కు వచ్చే వారు ఎవరైనా ఈ కార్డు పొందవచ్చు. ఈ కార్డును భూమిలో నాటితే అందమైన బంతి పువ్వు మొక్క పెరుగుతుంది’ అని పోస్టులో రాసుకోచ్చారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. మీరు గ్రేట్ సర్.. మీ ప్రయత్నం సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరి కొందరు రియాక్ట్ అవుతూ పర్యావరణానికి హాని తలపెట్టని ఈ విజిటింగ్ కార్డులు ఎక్కడ తయారు చేస్తారో చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed