- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్గిల్ యుద్ధంలో మరణించిన వీరులకు నివాళులర్పించిన ఐఏఎఫ్
దిశ, నేషనల్ బ్యూరో: 1999 కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో రజతోత్సవాన్ని(25 ఏళ్లు) పురస్కరించుకుని భారత వైమానిక దళం 'కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి'ని జులై 12-26 వరకు యూపీలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సర్సావాలో జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం, 25 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పించింది. ఈ సందర్బంగా వేలాది స్ట్రైక్ మిషన్లు, హెలికాప్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. అలాగే, దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని సత్కరించారు.
ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ ప్రదర్శనలతో పాటు Mi-17 V5, చిరుత, చినూక్ వంటి IAF హెలికాప్టర్‌లతో ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, సహరాన్‌పూర్ ప్రాంతంలోని స్థానిక నివాసితులు, పౌర ప్రముఖులు, రూర్కీ, డెహ్రాడూన్, అంబాలా నుండి రక్షణ దళాల సిబ్బందితో సహా 5,000 మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
25 ఏళ్ల క్రితం లడఖ్‌లోని కార్గిల్‌లోకి అక్రమంగా ప్రవేశించి దాన్ని ఆక్రమించుకోవాలకున్న పాక్ సైన్యం, ఉగ్రవాదులకు మన సైన్యం హడల్ పుట్టించింది. పరాక్రమంగా పోరాడిన ధీరమైన వైమానిక యోధుల ధైర్యం, త్యాగాన్ని భారత వైమానిక దళం గుర్తు చేసుకుంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరి స్టేషన్ వార్ మెమోరియల్ వద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించిన వైమానిక యోధులందరికీ నివాళులర్పించారు.