ఎల్లలు దాటిన మానవత్వం..పాక్ యువతికి భారతీయుడి గుండె

by Disha Web Desk 18 |
ఎల్లలు దాటిన మానవత్వం..పాక్ యువతికి భారతీయుడి గుండె
X

దిశ,వెబ్‌డెస్క్: మానవత్వానికి ఎల్లలు లేవని మరోసారి రుజువైంది. సమాజంలో ఇంకా మానవత్వం ఉందని చెన్నైలో జరిగిన ఓ ఘటనే సాక్ష్యం. చెన్నైలోని ఓ హాస్పిటల్ వైద్యులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ పాకిస్తాన్ యువతికి భారతీయుడి గుండెను అమర్చి ప్రాణదానం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..పాకిస్తాన్‌కి చెందిన 19 ఏళ్ల రశన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి చేయకుంటే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. ఈ చికిత్సకు దాదాపు రూ.35 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పడంతో రశన్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వారిని ఆదుకోవడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.

వైద్యులు ఆమెకి భారత్‌లో ట్రీట్‌మెంట్ చేసెందుకు నిర్ణయించుకున్నారు. చెన్నైలోని ఎమ్‌జీఎమ్ హెల్త్ కేర్ హాస్పిటల్‌లో ఆమెకి చికిత్స చేయడాని సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే రశన్‌కి భారతీయుడి గుండెను అమర్చడంలో సక్సెస్ అయ్యారు. నిజానికి ఇది ఓ గొప్ప సంఘటనగా చెప్పవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే వైద్యులు చికిత్స కోసం యువతి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. కాగా ప్రజెంట్ రశన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోతుందనుకున్న తమ కూతురు ప్రాణాలు నిలిపినందుకు రశన్ తల్లిదండ్రులు ట్రస్ట్, ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు ఎల్లలు దాటిన మానవత్వం అంటూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed