- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC: ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేడ్కర్‌కు భారీ ఉపశమనం.. అరెస్ట్ పై స్టే
దిశ, డైనమిక్ బ్యూరో: నకిలీ దృవపత్రాలు సమర్పించి ఐఏఎస్ ఉద్యోగం సాధించారని ఆరోపణలు ఎదుర్కుంటున్న పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఆమె అరెస్ట్ పై కోర్టు స్టే విధించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఫేక్ డాక్యూమెంట్స్ తో ఉత్తీర్ణత సాధించిందని మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ముందస్తు బెయిల్ కోరుతూ.. పూజా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పూజా ఖేడ్కర్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆమె అరెస్ట్ పై ఆగస్ట్ 21 వరకు స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసులో యూపీఎస్సీ, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంతేగాక పూజా ఖేడ్కర్ కు రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించిన ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టింది. ట్రయల్ కోర్టు ఆమెపై వచ్చిన అభియోగాలను మాత్రమే పట్టించుకుందని, బెయిల్ పిటీషన్ ను సరిగ్గా పరిగణించలేదని తెలిపింది. కాగా యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు మోసపూరిత మార్గాలను అనుసరించిందని, పరీక్షలకు ఎక్కువసార్లు హాజరయ్యేందుకు నకిలీ ఐడెంటిటీ ఉపయోగించినందని తనపై నమోదైన కేసులో పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.