భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

by GSrikanth |
భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
X

దిశ, వెబ్‌‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రీతమ్ పురాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో మొదలై మూడో అంతస్తుకు భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 7 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story