గడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

by GSrikanth |
గడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గడ్చిరౌలి కెడ్మారా అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరో నలుగురికి గాయాలు అయినట్టు సమాచారం. పెరిమిల్లి, అహేరి దళాలకు చెందిన మావోయిస్టులు కెడ్మారా అటవీ ప్రాంతం మనే రాజరాం-పెరిమిల్లి ఆర్మ్ డ్ ఔట్పోస్ట్ మధ్యలో ఉన్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసు బృందాలు గాలించాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో వీరిని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరుపగా ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

వీరిలో పెరిమిల్లి దళం కమాండర్ బిట్లు మాధవి, అదే దళానికి చెందిన వాసు, అహేరి దళానికి చెందిన శ్రీకాంత్ ఉన్నట్టు గడ్చిరౌలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. మార్చి 9న జరిగిన స్టూడెంట్ సాయినాథ్ నరోటే హత్య కేసులో బిట్లు మాధవి ప్రధాన నిందితురాలు అని ఎస్పీ చెప్పారు. ఇక, వాసు ఇటీవలే డివిజనల్ కమిటీ మెంబర్‌గా నియమితులైనట్టు తెలిపారు. శ్రీకాంత్ అహేరి దళం డిప్యూటీ కమాండర్ అని చెప్పారు. ఎన్ కౌంటర్ స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బిట్లు మాధవిపై మహారాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల రివార్డు ప్రకటించిందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed