Howrah-bound train: ముంబై- హౌరా ఎక్స్ ప్రెస్ ని పేల్చేస్తామని బెదిరింపులు

by Shamantha N |
Howrah-bound train: ముంబై- హౌరా ఎక్స్ ప్రెస్ ని పేల్చేస్తామని బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై నుంచి పలు ప్రాంతాలకు వెళ్తున్న రెండు విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం రెండు విమానాలకు బెదిరింపులు వచ్చాయి. కాగా.. రైళ్లకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. సోమవారం ఉదయం ముంబై – హౌరా మెయిల్‌ (Mumbai – Howrah Mail)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మెయిల్‌ ద్వారా ఓ సందేశం వచ్చింది. అందులో 12809 నంబర్‌ గల రైలును టైమర్‌ బాంబు (timer bomb)తో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్రైన్‌ను మహారాష్ట్రోలని జల్గావ్‌ స్టేషన్‌ (Jalgaon station) వద్ద ఆపి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ కనిపించలేదని అధికారులు తెలిపారు. తనిఖీల తర్వాత రైలు తిరిగి హౌరా వెళ్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

విమానాలకు బెదిరింపులు

ఇకపోతే, సోమవారం ఉదయం రెండు విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ముంబై నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా (Air India), ముంబై నుంచి మస్కట్‌ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపులపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed