‘హజ్’ మరణాల్లో ఎంతమంది భారతీయులున్నారంటే?

by vinod kumar |
‘హజ్’ మరణాల్లో ఎంతమంది భారతీయులున్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: సౌదీలోని హజ్ యాత్రలో వేడి గాలుల కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 645 మంది హజ్ యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో సుమారు 90 మంది భారతీయులు ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అత్యధిక మరణాలు వడడెబ్బ వల్లే సంభవించినట్టు సమాచారం. మరోవైపు ఈ ఏడాది హజ్ యాత్రలో 68 మంది ఇండియన్స్ మరణించారని అరబ్ దౌత్యవేత్త ధృవీకరించినట్టు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్ల మంది ప్రజలు ఈ యాత్రను సందర్శించారు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తీర్థయాత్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దశాబ్దానికి 0.4 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతున్నాయి. 2023లో హజ్ యాత్ర సమయంలో 200 మందికి పైగా యాత్రికులు మరణించారు. అప్పుడు ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌ ఉండటంతో 2,000 మంది తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed