- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ వేవ్‌తో పోలిస్తే ఆస్పత్రుల్లో చేరికలూ తక్కువే
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌లో కేసుల సంఖ్యతో పోల్చినపుడు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు సమర్ధవంతంగా ఉన్నారని, వీరిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. గతేడాది రెండో వేవ్ సమయంలో ఉన్న డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ప్రస్తుత వేరియంట్ ప్రభావం గణాంకాల పరంగా తక్కువే ఉన్నట్లు వెల్లడించారు. కొత్త వేరియంట్‌తో నమోదైన మరణాలు రేటు కూడా రెండో వేవ్‌తో పోలిస్తే అత్యల్పంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలో సెకండ్ వేవ్, మూడో వేవ్ సమయాల్లో కరోనాతో నిండిన పడకల మధ్య వ్యత్యాసాన్ని పోల్చి చూశారు.
రెండు, మూడో వేవ్ సమయంలో మరణాల రేటును పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉందని చెప్పారు. అదే సమయంలో టీకాలు వేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఢిల్లీలో ఆసుపత్రుల్లో చేరికలు 2.88శాతం నుంచి 3.19కు పెరిగాయన్నారు. అదే సమయంలో రాజధాని నగరంలో కేసుల సంఖ్య తగ్గిందని చెప్పారు. 'మహమ్మారి బారిన పడిన వారిలో 99 శాతం మందిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నాయి. ఐదు రోజుల్లో ఈ లక్షణాలు తగ్గుతున్నాయి. నీరసం, కండరాల బలహీనత వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి' అని అన్నారు. 11 నుంచి 18 ఏళ్ల వయస్సు వారిలో జలుబుతో పాటు జ్వరం సాధారణ లక్షణం గా ఉందని చెప్పారు.
పెరిగిన వ్యాక్సినేషన్
గత ఏడాది ఏప్రిల్ 30న దేశంలో 3,86,452 కేసులు నమోదు కాగా 3,059 మరణాలతో పాటు 31,70,228 క్రియాశీలక కేసులు ఉన్నాయన్నారు. ఆ సమయంలో కేవలం రెండు శాతం మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. ఇక ప్రస్తుతం 3 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా మరణాలు 380 మాత్రమే ఉండగా, క్రియాశీలక కేసులు 19,24,051గా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 72 శాతానికి చేరిందని అన్నారు.
గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 మధ్యలో నమోదైన మరణాల సంఖ్య స్థిరంగా పెరిగిందన్నారు. కానీ ఈ నెల 1 నుంచి 20 మధ్యలో చాలా తగ్గిందని తెలిపారు. ఇక, ప్రభుత్వ గణాంకాల ప్రకారం 94 శాతం మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోగా, 72 శాతం మంది పూర్తి డోసులు తీసుకున్నారు. 15-18 ఏళ్ల మధ్య వయసు వారు 52 శాతం మొదటి డోసు తీసుకున్నారు. 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు, 515 జిల్లాలో వారం వారం పాజిటివిటీ రేటు 5 శాతానికి పైగా ఉంది.