ఆరెస్సెస్‌కు మద్దతుగా మమతా.. అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహాం

by Harish |   ( Updated:2022-09-01 11:53:15.0  )
ఆరెస్సెస్‌కు మద్దతుగా మమతా.. అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహాం
X

కోల్‌కతా: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. దీదీ ఆరెస్సెస్‌కు మద్దతుగా మాట్లాడటం కొనసాగిస్తుందని అన్నారు. ఆరెస్సెస్ హిందూ రాష్ట్రాన్ని కోరుకుంటారని, వారి చరిత్ర మొత్తం ముస్లిం వ్యతిరేకించే విద్వేష నేరాలే ఉన్నాయని పేర్కొన్నారు. టీఎంసీ ముస్లిం నేతలు మమతా స్థిరత్వం, నిజాయితీని మెచ్చుకోవాలని వ్యంగ్యంగా గురువారం ట్వీట్ చేశారు.

గతంలో ఆరెస్సెస్ దేశభక్తులుగా పేర్కొన్నారని, దానికి బదులుగా ఆరెస్సెస్ దీదీని దుర్గగా పోల్చారని గుర్తుచేశారు. అయితే బుధవారం జరిగిన సమావేశంలో దీదీ ఓ ప్రసంగంలో ఆరెస్సెస్‌కు మద్దతుగా మాట్లాడారు. 'ఆరెస్సెస్ గతంలో అంత చెడుగా ఏమి లేదు. వారంతా చెడ్డవారని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ ఆరెస్సెస్‌లో చాలా మంది మంచి వ్యక్తులు ఉన్నారు. కొందరు బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు. ఏదో ఒకరోజు వారు నిశ్శబ్దాన్ని చేధిస్తారు' అని అన్నారు.

మరోవైపు బెంగాల్ ఇమామ్ అసోసియేషన్ హెడ్ మహ్మద్ యహ్యా కూడా మమతా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా సందేశం సానుకూల మార్గంలో లేదని పేర్కొన్నారు.

Also Read : 'బిహార్ సీఎం అమాయకుడు.. కేసీఆర్ ఉచ్చులో చిక్కుకున్నాడు'

Advertisement

Next Story

Most Viewed