సరిహద్దు పరిస్థితులను బట్టి చైనాతో సమస్యల పరిష్కారం: ఎస్ జైశంకర్

by S Gopi |
సరిహద్దు పరిస్థితులను బట్టి చైనాతో సమస్యల పరిష్కారం: ఎస్ జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో మిగిలిన సమస్యల పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ అన్నారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ సరిహద్దులో శాంతి, ప్రశాంతతపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పీఐటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేంద్రమంత్రి.. మిగిలిన సమస్యలు ప్రధానంగా గస్తీ హక్కులు, సరిహద్దు భద్రతకు సంబంధించినవేనన్నారు. ఇటీవల ప్రధాని మోడీ సైతం ఇరు దేశాల సరిహద్దు సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి, ఈ అంశాన్ని మరింత విస్తృత పరిష్కారానికే మోడీ చెప్పారని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం భారత్‌, చైనాకే కాకుండా మొత్తం ప్రపంచానికే చాలా కీలకం. చైనాతో మన సంబంధాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగింది. కాబట్టి వాటి పునరుద్ధరణపై ఆధారపడి రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ ఆ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరగడంపై మాట్లాడిన జైశంకర్.. 2014కి ముందు తయారీ రంగానికి ప్రాధాన్యత కొరవడింది. అందుకే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని వెల్లడించారు.



Next Story