- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా సమావేశం
దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే నక్సలైట్లను పూర్తిగా అంతమొందిస్తామని పలు వేదికల్లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే నక్సల్స్ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిత్యం కూంబింగ్ నిర్వహిస్తూ.. ఎన్ కౌంటర్లు చేస్తూనే ఉన్నారు. గత సంవత్సర కాలంలో వందల సార్లు ఎన్ కౌంటర్లు జరగ్గా.. సుమారు 180 మంది నక్సల్స్ హతమయ్యారు. తాజాగా రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లోని నెందూర్ - థుల్ థులి గ్రామాల మధ్యనున్న బస్తర్ (Baster Forest) అడవుల్లో 31 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ చేయబడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ను ఏరివేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అందరికి ఇక్కడే అర్ధం అయింది. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, హోంశాఖ మంత్రులు హాజరుకానున్నారు.