Ayodhya RamMadir :వచ్చే ఏడాది జనవరి 1న రామ మందిరం ప్రారంభం : Amit Shah

by Nagaya |   ( Updated:2023-01-05 13:49:50.0  )
Ayodhya RamMadir :వచ్చే ఏడాది జనవరి 1న రామ మందిరం ప్రారంభం : Amit Shah
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1,2024కి రామ మందిరం సిద్ధం అవుతుందని ప్రకటించారు. గురువారం త్రిపురలో 'జన్ విశ్వాస్ యాత్ర'ప్రారంభించిన ఆయన ఈ ప్రకటన చేశారు. మరికొన్ని రోజుల్లో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సందర్భంగా బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టార్గెట్‌గా రాహుల్ గాంధీపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. 'రాహుల్ బాబా వినండి... నేను రామ మందిరం తెరవడానికి తేదీలు ప్రకటిస్తున్నాను' అంటూ జనవరి 1,2024 నాటికి అయోధ్య రామమందిరం సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, కోర్టుల్లో రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని మండిపడ్డారు.

కాగా, దేశంలోని హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed