- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబర్‌పై ప్రేమతోనే రామమందిర ఆహ్వానానికి కాంగ్రెస్ తిరస్కారం : హిమంత
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘శ్రీరాముడు, బాబర్‌లలో ఎవరు కావాలంటే.. కాంగ్రెస్ ఎల్లప్పుడూ రెండోదాన్నే ఎంచుకుంటుంది’’ అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యానించారు. బాబర్ వైపు నిలిచే వైఖరి ఉండటం వల్లే జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి హస్తం పార్టీ నిరాకరించిందని ఆరోపించారు. ఇలాంటి వాళ్లు పవిత్రమైన శ్రీరాముడి కార్యక్రమానికి హాజరు కాకపోవడమే మంచిదని ఆయన పేర్కొన్నారు. ఈనెల 22న అయోధ్యకు వెళ్లొద్దనే నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా.. తమ పూర్వపు పాపాలను తగ్గించుకునే అవకాశాన్ని కాంగ్రెస్ నాయకులు కోల్పోయారని ఎద్దేవా చేశారు. అసలు ఇంత గొప్ప కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించి ఉండాల్సింది కాదన్నారు. ఈమేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఒక పోస్ట్ చేసిన హిమంత.. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఉన్న బాబర్ సమాధి వద్ద రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి ఘటిస్తున్న 2005 సంవత్సరం నాటి ఫొటోను షేర్ చేశారు.