- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక రాష్ట్రంలో రగులుతోన్న 'హిజాబ్' వివాదం!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 'హిజాబ్' (ముస్లిం విద్యార్థినిల మేలిముసుగు) విషయంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పాఠశాలలు, కళాశాలల్లోకి హిజాబ్ ను అనుమతించాలని విద్యార్థినిలు కోరుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డ్రెస్ కోడ్‌ను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. హిజాబ్ అనుమతించాలని అటు ముస్లిం విద్యార్థినులు ఆందోళన చేస్తుండగా, వారికి అనుమతిస్తే తమకు కూడా కాషాయ కండువలు వేసుకుని పాఠశాలల్లోకి వచ్చేందుకు అనుమతివ్వాలని హిందూ విద్యార్థినీ విద్యార్థులు కోరుతున్నారు.
దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల పరిసరాల్లో 200 మీటర్ల మేర ఆంక్షలు విధించారు. ఆందోళనలు, సమూహాలు, సభలు నిర్వహించకుండా ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
విస్తృత ధర్మాసనానికి పిటిషన్ బదిలీ..
హిజాబ్ వివాదంపై ఐదుగురు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హిజాబ్‌ను అనుమతినిచ్చేలా తీర్పునివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయమూర్తి వాదించగా.. డ్రెస్ కోడ్ తప్ప వేటిని అనుమతించబోమని ప్రభుత్వం తరఫు లాయర్ వాదించడంతో దీనిని ఏకసభ్య ధర్మాసనం విస్తృత బెంచ్‌కు బదిలీచేస్తూ తీర్పునిచ్చింది.