హమాస్- ఇజ్రాయెల్ యుద్ధంలో లెబనాన్ జోక్యం

by Shamantha N |
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధంలో లెబనాన్ జోక్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. హమాస్- ఇజ్రాయెల్ ఉద్రిక్తల్లో హిజ్ బొల్లా జోక్యం చేసుకుంది. దీంతో, అక్కడ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై లెబనాన్ దాడికి పాల్పడింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపునకు 30 ప్రొజెక్టైల్స్ దూసుకెళ్లినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. హమాస్ చీఫ్ మరణాన్ని ధ్రువీకరించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. లెబనాన్‌కు చెందిన హిజ్ బొల్లా ఈ దాడికి బాధ్యత వహించిందని స్థానిక మీడియా తెలిపింది. సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్ బొల్లాకు అనుబంధంగా ఉన్న అల్ మయాదీన్ సైట్ పేర్కొంది. అయితే, హెజ్ బొల్లా ప్రయోగించిన ప్రొజెక్టైల్స్ బహిరంగ ప్రదేశాల్లో పడ్డాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాడి తర్వాత ఈ ప్రాంతంలో గైడెడ్ మిస్సైల్స్ సబ్ మెరైన్ ను మోహరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని గుర్తుచేశారు. రెండు నౌకలు, ఒక జలాంతర్గామిని ఇజ్రాయెల్ కు పంపినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed