Hemanth soren: హేమంత్ బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఈడీ..ఈ నెల 29న విచారణ

by vinod kumar |
Hemanth soren: హేమంత్ బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఈడీ..ఈ నెల 29న విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: భూ కుంభకోణం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. సోరెన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని జార్ఖండ్ హైకోర్టు తప్పుపట్టిందని ఈడీ తన అప్పీల్‌లో పేర్కొంది. సోరెన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. దీనిపై ఈ నెల 29న విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కెవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిని విచారించనుంది. కాగా, భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత రాంచీలోని హోత్వార్‌లో ఉన్న బిర్సా ముండా జైలులో ఉన్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన బయటకు వచ్చి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed