హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం..104 రోడ్లు మూసివేత

by samatah |
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం..104 రోడ్లు మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి భారీ హిమపాతం సంభవించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు, మంచు కురుస్తుండటంతో మూడు జాతీయ రహదారులు సహా 104 రోడ్లను అధికారులు మూసివేశారు. లాహోల్, స్పితి జిల్లాల్లో అత్యధికంగా 99రోడ్లు బ్లాక్ చేయగా..కులులో 3, చంబా, కాంగ్రాలో ఒక్కొక్క రోడ్లను బ్లాక్ చేశారు. అలాగే భారీ వర్షాల కారణంగా ఓ వంతెన కొట్టుకుపోయినట్టు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. వర్షాలు, హిమపాతం కారణంగా జనజీవనం స్థంభించినట్టు వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 22, 23తేదీల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం వల్ల ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed