భారీ వర్షాలతో అతలాకుతలం.. వరద గుప్పిట్లో పలు ప్రాంతాలు:

by Seetharam |
భారీ వర్షాలతో అతలాకుతలం.. వరద గుప్పిట్లో పలు ప్రాంతాలు:
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ముంబయిలో ఈ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గరిష్ఠంగా 98 మిమీ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ముంబయి, థానే ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు అంధేరీ సబ్ వే నీట మునిగింది. గోరేగావ్, విలేపార్లే, లోయర్ పారెల్ ప్రాంతాల్లోనూ వర్షబీభత్సం కనిపించింది. థానేలో రహదారులు జలమయం అయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. బోరివెలి వెస్ట్, ఎస్వీ రోడ్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

తెలంగాణలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే హైదరాబాద్‌లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed