చెన్నైలో భారీ వర్షాలు.. నైరుతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో..!

by Seetharam |
చెన్నైలో భారీ వర్షాలు.. నైరుతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో..!
X

దిశ,వెబ్‌డెస్క్: రానున్న 24 గంటల్లో చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం సౌత్ జోన్ చీఫ్ బాలచంద్రన్ సోమవారం వెల్లడించారు. చెన్నై సిటీతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. చెన్నైలో భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రాత్రి మొదలైన వర్షం చెన్నైలో పగలంతా కొనసాగింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు సైతం జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్ నీట మునగడంతో పలు రైళ్లను దారి మళ్లించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో లేటుగా విస్తరించనుండటంతో వేడిమి వాతావరణం నెలకొంది. ఈ వేడి వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు ఇలానే ఉండే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే కొన్ని చోట్ల అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతు పవనాలు ముందుగా రాయలసీమ ప్రాంతంలో విస్తరించడంతో అక్కడ వర్షాలు పడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed