- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Coaching institute: సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోకి భారీ వరద..ఇద్దరు విద్యార్థినులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని ప్రముఖ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్ మెంట్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ఇద్దరు విద్యార్థినులు మరణించారు. మరికొందరు విద్యార్థులు అందులోనే చిక్కుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..రావు ఐఏఎస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లోని బేస్‌మెంట్‌లకి వరదలు వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. అనంతరం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న విద్యార్థులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. సహాయక చర్యలు ప్రారంభించిన తర్వాత ఇద్దరు విద్యార్థినుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ వర్షం కారణంగా వరదలు వచ్చాయని వెంటనే సహాయక చర్యలు చేపట్టామని ఢిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ కోచింగ్ సెంటర్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.