Supreme Court : అసదుద్దీన్ ఒవైసీ పిటీషన్ విచారణ ఫిబ్రవరి 17కు వాయిదా

by Y. Venkata Narasimha Reddy |
Supreme Court : అసదుద్దీన్ ఒవైసీ పిటీషన్ విచారణ ఫిబ్రవరి 17కు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం-1991(Places of Worship Act-1991)ని అమలు(Implement) చేయాలంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(AIMIM Chief And Hyderabad MP Asaduddin Owaisi) దాఖలు చేసిన పిటిషన్‌(Petition)ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు(Supreme Court) తదుపరి విచారణను ఫిబ్రవరి 17వ తేదీకి వాయిదా వేసింది. దేశంలో ఇటీవల ‘మసీదు కింద దేవాలయం’ వివాదాలు పెరుగుతుండటం..మసీదులు, దర్గాల ప్రాంగణాల్లో సర్వేలు జరపాలంటూ హిందూ సంస్థలు దిగువ కోర్టుల్లో కేసులు వేసిన నేపథ్యంలో ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలుపరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇదే అంశంపై దాఖలైన ఇతర ఆరు పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత కలిపి అన్ని పిటిషన్లపై ఫిబ్రవరి 17న విచారణ జరుపుతామని తెలిపింది.

అయితే సుప్రీం కోర్టు అంతకుముందే అంటే డిసెంబర్ 12, 2024న ఇదే తరహా పిటీషన్లను విచారణకు స్వీకరిస్తూ.. 1991 చట్టానికి వ్యతిరేకంగా లేదా మసీదులు, దర్గాల స్వరూపం మార్చాలని దాఖలైన ఎటువంటి కేసులు విచారణకు స్వీకరించవద్దు అని దేశంలోని అన్ని కోర్టులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఒక స్పెషల్ ప్రొవిజన్స్ చట్టం. ఈ చట్టం ప్రకారం అన్ని ప్రార్థనా స్థలాలను (దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు.. మొదలైనవి) ఆగస్టు 15, 1947న ఏ స్వరూపంలో ఉన్నాయో అదే స్వరూపంలోనే ఉండాలని ఆదేశించింది.

అయితే గత కొన్ని నెలలుగా దేశంలోని కింది కోర్టులు, హై కోర్టులు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. మసీదు కింద హిందు కట్టడాల అవశేషాలున్నాయని.. వాటిని తిరిగి హిందువులకు అప్పగించాలని దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టాయి. పైగా మసీదు లోపల పురావస్తు శాఖ సర్వే చేయాలని ఆదేశించాయి. ఇప్పటికే ఇలాంటి 12 కేసులు విచారణలో ఉన్నాయి. వారణాసి లోని జ్ఞానవాపి మసీదు, ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ షాహీ మసీదు, అజ్మేర్ దర్గాల లోపల హిందూ కట్టడాలున్నట్లు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని కోర్టులు విచారణకు స్వీకరించాయి. ఈ నేపథ్యంలో 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలుపరుచాలంటూ ఒవైసీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed