Haryana: పంచాయతీలో ఏఐ టెక్నాలజీ.. హర్యానాలోని ఓ గ్రామంలో వినూత్న ప్రచారం !

by vinod kumar |
Haryana: పంచాయతీలో ఏఐ టెక్నాలజీ.. హర్యానాలోని ఓ గ్రామంలో వినూత్న ప్రచారం   !
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా (Haryana)లోని జింద్ జిల్లాలో ఉన్న బీబీపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సునీల్ జగ్లాన్ (Sunil jaglan) పంచాయతీల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సాంకేతికతను అమలు చేయడానికి ముందు కొచ్చారు. ఈ మేరకు ‘ఏఐ ఫ్రెండ్లీ పంచాయతీ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాలన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపర్చడానికి ఏఐని ఉపయోగించుకోవడమే ఈ ప్రచార లక్ష్యమని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి పథకాలను స్మార్ట్, ప్రభావవంతంగా మార్చడంతో పాటు సైబర్ భద్రత, అవగాహనలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

‘ప్రతి గ్రామ పంచాయతీ ప్రభుత్వం నుంచి నిధులను స్వీకరించడానికి అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి. ఈ నిధులను యాక్సెస్ చేయడానికి తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రతిపాదనను సమర్పించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శికి ఉంది. కానీ పని భారం కారణంగా పంచాయతీలకు అవసరమైన నిధులు సరిగా అందడం లేదు. ఏఐని ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించొచ్చు’ అని తెలిపారు. కాగా, అంతకుముందు కూడా జగ్లాన్ వినూత్న కార్యక్రమాలు చేపట్టి తన స్వగ్రామమైన బీబీపూర్‌ను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దారు.

Advertisement

Next Story