- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పశ్చాత్తాపం లేదు.. హ్యాపీగా నిష్క్రమిస్తున్నా.. కాంగ్రెస్ దిగ్గజ నేత వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఎన్నికల్లో లోక్‌సభ టికెట్ దక్కకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ అన్నీ ఇచ్చిందని, ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలకు తాను ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. తనను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించకపోవడాన్ని కూడా పార్టీ ఎత్తుగడలలో భాగంగానే భావిస్తున్నట్లు, దీన్ని తప్పుగా అర్థం చేసుకోనని వీరప్ప మొయిలీ తెలిపారు. ‘‘నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ కావడానికి ఇదే మంచి తరుణం. నాకు ఇప్పుడు 84 ఏళ్ల వయసుంది. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వంటి నాయకులు కూడా ఈసారి పోటీ చేయడం లేదు. వాళ్లలాగే నన్ను కూడా పోటీ నుంచి తప్పుకోమని హైకమాండ్ కోరడంతో సరేనన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 హయాంలో తనకు మంత్రి పదవి లభించిందని, అప్పట్లో ఆరు శాఖలను నిర్వహించే అవకాశం లభించిందని మొయిలీ గుర్తు చేశారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లోక్‌సభ స్థానం నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి మొయిలీ టికెట్ ఆశించినప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ ఆ అవకాశం ఇవ్వలేదు.