- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కొడుకు తప్పు చేస్తే ఉరితీయండి: ప్రజ్వల్ తండ్రి హెచ్ డీ రేవణ్ణ
దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ప్రజ్వల్ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడు తప్పు చేస్తే ఉరితీయాలని అన్నారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయం చర్చకు రావడంతో ఆయన మాట్లాడారు. ‘నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయాలి. వద్దు అని చెప్పను. నేను విషయాలను సమర్థించడానికి, చర్చించడానికి ఇక్కడకు రాలేదు’ అని తెలిపారు. నేను 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని, అందులో 25ఏళ్ల ఎమ్మెల్యేగా సేవలందించానని గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా ఓ మహిళను డీజీపీ కార్యాలయానికి తీసుకొచ్చి ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. ఇదొక పనికి మాలిన చర్య అని అభివర్ణించారు. ఆయన డీజీపీగా పనికి రారని వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది.