- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hamas: కాల్పుల విరమణ వివాదానికి తెర.. బందీలను రిలీజ్ చేస్తామని హమాస్ ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ (Israel hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. అగ్రిమెంట్ ప్రకారం తదుపరి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది. సీజ్ ఫైర్ ఒప్పందానికి మధ్య వర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్ (Egypt), ఖతార్ (Qatar) దేశాలు తమ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మరో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను యథాతథంగా శనివారం రిలీజ్ చేస్తామని వెల్లడించింది. అయితే హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. హమాస్ ప్రకటనతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతానికి కొనసాగనున్నట్టు తెలుస్తోంది. కానీ తదుపరిగా ఇలానే ఉంటుందా రెండో దశ సీజ్ ఫైర్ సైతం ఉంటుందా అనే సందేహం నెలకొంది.
కాగా, గత నెలలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదల, దానికి బదులుగా పాలస్తీనా ఖైదీల రిలీజ్ సజావుగా సాగుతోంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ తదుపరి బందీలను విడుదల చేయబోమని హమాస్ ఇటీవల ప్రకటించింది. దీంతో హమాస్ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహులు తీవ్రంగా స్పందించారు. బందీలను విడుదల చేయకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. తమ సైన్యం చివరిదాకా పోరాడుతుందని నెతన్యాహు అల్టీమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే హమాస్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అయితే హమాస్ ప్రతినిధి బృందం ఈజిప్టు అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.