Manish Sisodia: నా కుమారుడి ఫీజు కోసం డబ్బులు అడుక్కోవాల్సి వచ్చింది.. భావోద్వేగానికి గురైన సిసోడియా

by Shamantha N |
Manish Sisodia: నా కుమారుడి ఫీజు కోసం డబ్బులు అడుక్కోవాల్సి వచ్చింది.. భావోద్వేగానికి గురైన సిసోడియా
X

దిశ, నేషనల్ బ్యూరో: జైలులో ఉన్నప్పుడు తన కుమారుడి ఫీజు కోసం డబ్బులు అడుక్కోవాల్సి వచ్చిందని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆప్ నిర్వహించిన జనతా కీ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఆప్‌ను విచ్ఛిన్నం చేసినందుకు తనను, పార్టీ నాయకులను అరెస్టు చేశారని అన్నారు. ఆప్ నేతలను, పార్టీని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని అన్నారు. అలానే తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పారు. "2002లో నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు నేను రూ. 5 లక్షల విలువైన ఫ్లాట్ కొన్నాను. అంతే కాకుండా, నా అకౌంట్ లో రూ.10 లక్షలు ఉన్నాయి. వాటిని తీసుకోకుండా నా అకౌంట్ ని ఈడీ ఫ్రీజ్ చేసింది. నా కొడుకు ఫీజు కట్టుకోవడికి అడుక్కోవాల్సి వచ్చింది” అని సిసోడియా భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తేనే తాను కూడా ప్రభుత్వంలో బాధ్యతలు చేపడతానని అన్నారు. కేజ్రీవాల్ ఇకపై సీఎంగా ఉండకపోవడం వల్ల ప్రజలు కొంత కలత చెందుతున్నారని తనకు తెలుసన్నారు. మూడు నాలుగు నెలలు ఆగితే మళ్లీ కేజ్రీవాలే సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీపై ఆరోపణలు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ పై కుట్ర పన్నేందుకు నన్ను పావుగా వాడుకోవాలని చూశారు. "వారు నన్ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. అరవింద్ కేజ్రీవాలే నన్ను ఇరికించారని కోర్టుకు చెప్పారు. జైలులోనేమో కేజ్రీవాల్ పేరు చెప్తే మిమ్మల్ని రక్షిస్తామన్నారు” అని ఆరోపించారు. తనకు బీజేపీలోకి మారేందుకు ఆఫర్లు వచ్చాయన్నారు. “నన్ను జైళ్లో చంపేస్తారని చెప్పారు . నా గురించి ఆలోచించమని.. రాజకీయాల్లో ఎవరూ ఎవరి గురించి ఆలోచించరని చెప్పారు. నా కుటుంబం గురించి, అనారోగ్యంతో ఉన్న నా భార్య గురించి, కాలేజీలో చదువుతున్న కుమారుడి గురించి ఆలోచించమని చెప్పారు” అని ఆరోపించారు. అయితే, తాను లక్ష్మణుడ్ని రాముడి నుంచి వేరు చేసేందుకు ప్రయత్నిస్తురని ఆ ప్రశ్నలకు ధీటుగా జవాబిచ్చానని అన్నారు. ప్రపంచంలో ఏ రావణుడికీ అలా చేసే శక్తి లేదన్నారు. 26 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ నాకు సోదరుడు, రాజకీయ గురువు అని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed