Mutton Bone Soup: సండే సాయంత్రం వేళ మటన్ బోన్ సూప్ ఇలా ప్రిపేర్ చేయండి.. కాల్షియం లోపానికి చెక్ పెట్టండి!

by Anjali |
Mutton Bone Soup: సండే సాయంత్రం వేళ మటన్ బోన్ సూప్ ఇలా ప్రిపేర్ చేయండి.. కాల్షియం లోపానికి చెక్ పెట్టండి!
X

దిశ, వెబ్‌డెస్క్: మటన్ బోన్ సూప్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయోరియా, పేగు రంధ్రాల్ని చొచ్చుకుపోకుండా మేలు చేస్తుంది. అంటు వ్యాధులను దరి చేరనివ్వదు. జలుబు, ఎముకలు విరగడం వంటి సమస్యలున్న వారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ స్థాయిల్ని కూడా పెంచడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా మటన్ బోన్ సూప్ కాల్షియం లోపంతో బాధపడుతున్నవారికి మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుష్కలంగా పోషకాలున్న ఈ సూప్ తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మరీ ఈ మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం..

మటన్ బోన్ సూప్ తయారీ విధానం..

ముందుగా మాంసంతో ఉన్న ఎముకలను ఒక కుండలోకి తీసుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకోవాలి. మాంసంతో ఉండటం మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ మాంసం లేకుండా ఉన్న బోన్స్‌ను కూడా తీసుకోవచ్చు. తర్వాత మసాలా, రోజ్మేరీ, థైమ్, పార్స్లీ వంటివి యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు బ్రోకోలి, క్యారెట్లు వేసి వాటర్ పోసుకోని కుండపై మూతపెట్టి ఉడికించాలి. దీంతో బోన్స్ నుంచి పోషకాలు ద్రవంలోకి చొచ్చుకుపోతాయి. ఇక అనేక పోషకాలతో కూడిన హెల్తీ మటన్ సూప్ రెడీ అయిపోయినట్లే. దీన్ని తీసుకున్నట్లైతే కాల్షియం లోపానికి చెక్ పెట్టొచ్చు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed