ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తే..మోడీ ఓడిపోయేవారు: రాహుల్ గాంధీ

by vinod kumar |
ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తే..మోడీ ఓడిపోయేవారు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి తన సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాని మోడీ 2 నుంచి 3లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రాయ్‌బరేలీలో మొదటి సారి పర్యటించిన రాహుల్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మోడీ, అమిత్ షాలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని, ఈ విషయం దేశ ప్రజలు గ్రహించినందువల్లే వారికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు.

ఏకంగా ఒక ప్రధాని బహిరంగంగా ద్వేషం, హింసాత్మక రాజకీయాలు చేయడం మొదటి సారి చూశామని చెప్పారు. ఇది భారతదేశ సంస్కృతికి, విరుద్ధమని నొక్కి చెప్పారు. మోడీతో ముగ్గురు పారిశ్రామిక వేత్తలు మాత్రమే లాభపడుతున్నారని ఆరోపించారు. ప్రచార సమయంలో సహకరించిన సమాజ్‌వాదీ పార్టీకి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ..ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నియోజక వర్గంలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌ నేతలు ఇద్దరూ రాయ్‌బరేలీకి రావడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story

Most Viewed