మోడీ లేకుంటే రామమందిరం ఉండేది కాదు- రాజ్ థాక్రే

by Shamantha N |
మోడీ లేకుంటే రామమందిరం ఉండేది కాదు- రాజ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ లేకుంటే అయోధ్య రామమందిర నిర్మాణం జరగకపోయేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే అన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నకల సమన్వయం కోసం మహాయుతి కూటమితో సంప్రదింపులు జరిపే నాయకుల జాబితాను తమ పార్టీయే నిర్ణయిస్తుందని అన్నారు. ఎంఎన్ఎస్ నాయకులు కూటమి మద్దతు ఉన్న అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొంటారని మీడియాకు తెలిపారు.

మోడీ లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా రామమందిరం నిర్మాణం జరిగేది కాదని.. ఇదో పెండింగ్ సమస్యగా నిలిచిపోయేదని అన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత రామమందిర నిర్మాణం పెండింగ్‌లో ఉందని థాక్రే చెప్పుకొచ్చారు. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఉద్ధవ్ థాక్రే శివసేన విమర్శించడంపై రాజ్ థాక్రే స్పందించారు. వారి పరిస్థితే దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో తమకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని, మరాఠీకి శాస్త్రీయ భాషా హోదా కల్పించాలని.. మహారాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని రాజ్ థాక్రే కోరారు. ఇకపోతే, 48 మంది ఎంపీలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 మధ్యలో 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed