Gun Fire: అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు స్పాట్ డెడ్

by Shiva |   ( Updated:2024-12-17 02:34:01.0  )
Gun Fire: అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. విస్కాన్సిన్ (Wisconsin)లోని ఓ పాఠశాలలో ఉన్నట్టుండి ఓ విద్యార్థి గన్‌తో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఊహించని ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన విద్యార్థి తనకు తానుగా షూట్ చేసుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Next Story

Most Viewed