- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి మరోసారి నిరాశ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఇవాళ ఈ పిటిషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు.. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక, ఈ కేసు విచారణను పూర్తి చేసిన గుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వేసవి సెలవుల తర్వాత కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఇక, కోర్టు తాజా నిర్ణయంతో పరువు నష్టం కేసులో దోషిగా తేల్చడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో రాహుల్ గాంధీకి మరోసారి చుక్కెదురైంది.
ఇక, 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరగాళ్లందరికి మోడీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుంది అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమరం రేపడంతో రాహుల్ గాంధీపై గుజరాత్‌లోని సెషన్స్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు అయ్యింది. ఈ కేసును విచారించిన సూరత్ సెషన్స్ కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషి అని తేల్చిన కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పార్లమెంట్ చట్టాల ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయ్యింది.