Green tribunal: యూపీ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు.. కారణమిదే?

by vinod kumar |
Green tribunal: యూపీ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ (Utharapradesh)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha kumbamela) చివరి దశకు చేరుకుంది. ఈ నెల 26న జాతర ముగియనుండగా అనేక మంది భక్తులు పవిత్ర స్నానం చేసేందుకు ప్రయాగ్ రాజ్ (Prayag raj) నగరానికి చేరుకుంటున్నారు. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు కుంభమేళాకు వస్తుండటంతో మరుగుదొడ్ల సమస్య తలెత్తుతోంది. మల మూత్ర విసర్జనకు అధికారులు అనేక బయో టాయిలెట్ల (Bio toilets)ను ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిపోవడం లేదు. దీనివల్ల ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయాల్సి వస్తోంది. దీంతో ఈ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో నిపుణ్ భూషణ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల లక్షలాది మంది ప్రజలు గంగా నది ఒడ్డున బహిరంగంగా మలవిసర్జన చేయవలసి వస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కుంభమేళా స్థలంలో పారిశుద్ధ్య సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున కాలుష్యం ఏర్పడుతోందని, కాబట్టి పారిశుధ్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనందున యూపీ ప్రభుత్వంపై రూ.10 కోట్ల పర్యావరణ పరిహారం విధించాలని డిమాండ్ చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వంతో పాటు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ, ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు (UPPCB)కి సైతం నోటీసులు జారీ చేసింది.

Next Story