- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెయింట్స్ వ్యాపారంలోకి బిర్లా గ్రూప్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పురాతన సంస్థ ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 'బిర్లా ఓపస్' పేరుతో కంపెనీ పెయింట్ ఉత్పత్తులను విక్రయించనుంది. దీనికోసం రూ. 10,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని, దేశంలోనే రెండో అతిపెద్ద పెయింట్ బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ గురువారం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశీయ పెయింట్ వ్యాపారంలో ఏషియన్ పెయింట్స్, బర్జర్ వంటి బ్రాండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 'దేశంలో ఊపందుకుంటున్న నిర్మాణ రంగం ద్వారా పెయింట్స్ వ్యాపారం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రంగంలో తాము ఒకేసారి ఆరు ప్లాంట్లను ప్రారంభిస్తున్నామని' ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. పానిపట్, తమిళనాడు, లూథియానాల్లో ఇప్పటికే మూడు ప్లాంట్లను కంపెనీ ప్రారంభించింది. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలైన మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యం వంటి పరిణామాల మధ్య ఆదిత్య బిర్లా గ్రూప్ పెయింట్ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం.