Supreme Court: ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు

by Shamantha N |
Supreme Court: ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రైవేటు ఆస్తుల గురించి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రైవేటు ఆస్తులను(Private Property) సహజవనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా, లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు సహజ వనరులు కావని తేల్చి చెప్పింది. వీటిని ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలులేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో వివాదాస్పద అంశంపై తీర్పు వెల్లడించింది. 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, బివి నాగరత్న, సుధాన్షు ధులియా, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మసీ ఉన్నారు. వీరిలో జస్టిస్‌ బీసీనాగరత్న పాక్షికంగా ఏకీభవించగా..జస్టిస్ సుధాన్షు ధులియా విభేదించారు.

Advertisement

Next Story

Most Viewed