- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: “గతంలో తప్పులు చేశా.. ఒప్పుకుంటున్నా”.. సమంత సంచలన కామెంట్స్.. పెళ్లి గురించేనా..?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు.. పెద్దల నొప్పించి పెళ్లి(Marriage) కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు(Divorce) తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulipala)తో ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny)అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ నవంబర్ 7నుంచి అమేజాన్ ప్రైమ్(amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలతో సమంత బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్యూ అండ్ ఎ’(Q&A) సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగా ఈ భామ సినిమాల్లో తన పాత్రల గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు మంచి పాత్రలే ఎంచుకోవడానికి ట్రై చేస్తా.. గతంలో నా రోల్స్ విషయంలో కొన్ని తప్పులు చేశాను. వాటిని ఒప్పుకుంటున్నా.. ఇప్పుడు జాగ్రత్తపడుతున్నా" అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.