Collector Jitesh V. Patil : సమాజానికి, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు రూపొందించాలి..

by Sumithra |
Collector Jitesh V. Patil : సమాజానికి, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు రూపొందించాలి..
X

దిశ, కొత్తగూడెం : ఈనెల 18, 19, 20 తేదీలలో అన్నపు రెడ్డిపల్లిలో జరిగే జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థిని విద్యార్థులు సమాజానికి, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు రూపొందించేటట్లుగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శన పై జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులకు మంగళవారం పాత కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణ కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వైజ్ఞానిక ప్రదర్శన కేవలం అలంకరణ కోసం కాకుండా దాని ద్వారా విద్యార్థులు గుణాత్మకమైన వ్యవసాయ వేత్తలుగా, శాస్త్రవేత్తలుగా తయారయ్యేటట్లుగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి మంచి ప్రాజెక్టుల రూపొందించాలని సూచించారు.

వైజ్ఞానిక ప్రదర్శనలోని ఉప అంశాలైన ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత, గణిత నమూనాలు, వ్యర్ధాల నిర్వహణ, వనరుల నిర్వహణ, సహజ వ్యవసాయం, రవాణా, సమాచార వ్యవస్థ, విపత్తు నిర్వహణ అనే అంశాలను వివరిస్తూ వాటిలో ఎటువంటి ప్రాజెక్టులు రూపకల్పన చేయవచ్చు అనే అంశాలను విశదీకరించారు. అంతేగాక జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టిన మునగ సాగు, వర్షపునీటి గుంటల తయారీ, అలాగే సాంప్రదాయ నిర్మాణ పద్ధతులు వంటి వాటి గురించి వివరిస్తూ వీటిలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆలోచనత్మకమైన ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులను భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేటట్లుగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజ శేఖర్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతి రాజు, రిసోర్స్ పర్సన్ లు సంపత్ కుమార్, చంద్రశేఖర్, తో పాటు జిల్లాలోని అన్ని పాఠశాలల నుండి సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed