8 యూట్యూబ్‌ చానళ్లపై నిషేధం..

by Vinod kumar |
8 యూట్యూబ్‌ చానళ్లపై నిషేధం..
X

న్యూఢిల్లీ : యూట్యూబ్‌లో నిజాలతో పాటు అవాస్తవ సమాచారం, ఫేక్ న్యూస్‌లు కూడా దర్శనమిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు యూట్యూబ్ ఛానళ్లపై కొరడా ఝళిపించింది. తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు 8 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. లోక్ సభ ఎన్నికలపై తప్పుడు ప్రచారం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిషేధిస్తారనే వదంతుల వ్యాప్తి, ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలు వంటివి పోస్ట్ చేసినందుకు ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కెపిఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, ఎస్‌పిఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్, వరల్డ్ బెస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత వాటిని బ్యాన్ చేశామన్నారు. ఇక ఈ యూట్యూబ్ ఛానళ్లలో "వరల్ట్ బెస్ట్ న్యూస్‌"కు 17 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు, 18 కోట్లకుపైగా వ్యూస్ ఉన్నాయి. ఈ ఛానల్‌లో ఇండియన్ ఆర్మీ గురించి తప్పుడు ప్రచారం చేసినట్టు గుర్తించారు. "ఎడ్యుకేషనల్ దోస్త్" ఛానల్‌కు 34 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 23 కోట్ల వ్యూస్ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తేలింది. 48 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న "ఎస్‌పిఎన్ 9 న్యూస్" లో ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని నిర్ధారణ అయింది.

Advertisement

Next Story

Most Viewed