- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరద్ పవార్తో అదానీ భేటీ
దిశ, వెబ్ డెస్క్: అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ముంబైలోని సిల్వర్ ఓక్ లోని పవార్ నివాసానికి వచ్చిన అదానీ.. రెండు గంటల పాటు పవార్ తో చర్చలు జరిపారు. అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ తో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కతాటి మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అదానీ అవినీతికి మోడీ అండగా నిలుస్తున్నారని వారంతా ఆరోపించారు. ఈ క్రమంలోనే అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నెల మొదటివారంలో అదానీని సపోర్ట్ చేస్తూ శరద్ పవార్ మాట్లాడారు. జేపీసీకి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను అదానీ కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.