- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగాల భర్తీకి సీఎం కీలక ప్రకటన!
దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రాజస్థాన్ లోని యువతకు, నిరుద్యోగులకు ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ కీలక హామీ ఇచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదివారం దౌసాలోని దుంగార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1 లక్ష పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని, యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. తద్వారా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం వస్తుందని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కేసులపై త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటోందని సీఎం భజన్ లాల్ శర్మ తెలిపారు